![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -846 లో..... అప్పు డల్ గా ఉండడంతో ధాన్యలక్ష్మిని రుద్రాణి తీసుకొని వచ్చి .. నీ కోడలు చూడు ఎలా ఉందో.. దీనికి కారణం ఆ కావ్య.. ఇలా ఉంటే పుట్టే బిడ్డపై ఎఫెక్ట్ కలుగుతుందని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. కళ్యాణ్ ని పిలిచి అప్పుని అలా బయటకు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ సరే అంటాడు. అప్పు దగ్గరికి వచ్చి బయటకు వెళదాం.. అమ్మ నిన్ను ఇలా చూసినట్లు ఉంది.. అందుకే బయటకు తీసుకొని వెళ్ళు అంది అనగానే అప్పు సరే అంటుంది.
మరొకవైపు రాజ్ కి వినపడేలా కావ్య తన ఫ్రెండ్ తో విడాకుల గురించి మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ బయటకు వెళదామని వస్తుంటే కావ్య మాటలు విని అప్పు నిజం అనుకొని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఏమైంది బయటకు వెళ్లలేదా అని అప్పుని ధాన్యలక్ష్మి అడుగుతుంది. లేదని అప్పు లోపలికి వెళ్తుంది. అప్పు రిటర్న్ రావడానికి కారణం ఆ కావ్య ఫోన్ లో విడాకుల గురించి మాట్లాడుతుంటే.. అప్పు విని ఇలా బాధపడుతూ వచ్చేసిందని ధాన్యలక్ష్మితో రుద్రాణి చెప్తుంది.
ఆ తర్వాత కావ్య, రాజ్ గొడవ పడుతారు. విడాకులు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. ఎక్కడ కావాలో చెప్పు అక్కడ సంతకం పెడతానని రాజ్ అంటాడు. అదంతా విని అప్పు కళ్ళు తిరిగిపడిపోతుంది. కావ్య దగ్గరికి వెళ్తుంటే మీ గొడవల వళ్ళే అప్పు కి ఇలా అయిందని ధాన్యాలక్ష్మి అంటుంది. డాక్టర్ చెకప్ చేసి అప్పు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలా అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ చెప్తుంది. రాజ్ కి డాక్టర్ ఫోన్ చేసి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు.. నేను కావ్యతో నిజం చెప్పాలా అని అంటుంది. తరువాయి భాగంలో ఇంట్లో గొడవలు ఇలా జరిగితే నా కొడుకు కోడలిని తీసుకొని వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మీ ఇష్టం అని రాజ్ అంటాడు. సీతారామయ్య వచ్చి రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |